Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్: తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా..!

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (21:59 IST)
కరోనా మహమ్మారి దేశంలో తగ్గినా.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తూనే వుంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా తాకిడి పెరుగుతూనే వుంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ధర్మశాల సమీపంలోని సిద్బరి గైటో తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
ఫిబ్రవరి 23న జిల్లాలో పలు కేసులు వెలుగుచూడగా, తాజాగా సిద్బరి మఠానికి చెందిన సన్యాసుల్లో 154 కొవిడ్‌-19 కేసులు బయటపడ్డాయని కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ గుర్‌దర్శన్‌ గుప్తా పేర్కొన్నారు. వీరిలో ఒక సన్యాసి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
 
కరోనా పాజిటివ్‌గా తేలిన మిగిలిన వారిని మఠంలోనే క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ మఠం పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామని, ఈ ప్రాంతంలోకి ఏ ఒక్కరినీ అనుమతించడం లేదని వెల్లడించారు. 
 
కరోనా వైరస్‌ సోకిన సన్యాసుల్లో పలువురు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కర్ణాటక, ఢిల్లీలో ప్రయాణించారని డాక్టర్‌ గుప్తా తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన సన్యాసుల్లో అత్యధికులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments