Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా వ్యాపిస్తున్న ఎన్‌బి.1.8.1 కరోనా వేరియంట్

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (14:25 IST)
అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూసింది. ఈ వేరియంట్‌కు ఎన్‌బి.1.8.1గా గుర్తించారు. అయితే, అమెరికాలో కంటే చైనాలో ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తుంది. పైగా, వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ వేరియంట్ ప్రస్తుతం అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 
 
న్యూయార్క్ నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ యేడాది మార్చి చివరి నుంచి ఏప్రిల్ ఆరంభం మధ్యకాలంలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ స్టేట్, వర్జీనియా, న్యూయార్క్ విమానాశ్రయాలకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులలో ఎన్‌బి.1.8.1 వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించారు. 
 
ఆ తర్వాత ఒరియో, రోడ్ ఐలాండ్, హవాయి రాష్ట్రాల్లోనూ మరిన్ని కేసులు బయటపడ్డాయి. అమెరికాలో ప్రస్తుతానికి ఈ కేసు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రం వేగంగా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ కొత్త వేరియంట్ లక్షణాలు కూడా పాతవాటి మాదిరిగానే దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, అలసట వంటివి ఉంటున్నాయి. అయితే, నెవాడా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సుభాష్ వర్మ వంటి నిపుణులు ఎన్‌బి 1.8.1 వేరియంట్‌కు గ్రోత్ అడ్వాంటేజ్ ఉందని అందుకే ఇది ఎక్కువగా వ్యాపిస్తోందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments