Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచం మీదికి చైనా మరో కొత్త వైరస్‌ను వదిలిందా? ఇప్పటికే చైనాలో చావులు మొదలు...

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:44 IST)
ప్రపంచంలో నలుమూలలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లోని వ్యూహాన్ ప్రాంతమన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇపుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. దీని బారి నుండి బయటపడలేక పలు దేశాలు క్రుంగిపోతున్నాయి. ఇదిలావుంటే చైనాలో మరో కొత్త వైరస్ ఉద్భవించింది. ఈ కొత్త వైరస్ గురించి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
 
ఈ వైరస్ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో జూలై నెలలో SFTS వైరస్ సుమారు 37 మందికి సోకింది. ఈ వైరస్ వల్ల ఏడుగురు మరణించారని సమాచారం. చైనా అధికారిక మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
 
చైనాలో తూర్పు ప్రాంతంలో ఉన్న జియాంగ్ ప్రావిన్స్‌లో వైరస్‌ను గుర్తించారు. ముందుగా ఈ ప్రాంతంలో ఒక మహిళకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ పరీక్షలో తెలిసిన విషయం ఏమిటంటే ఆమె శరీరంలో ల్యూకోసైట్స్ ప్లేట్‌లెట్స్ బాగా తగ్గాయని, వైద్యులు ఆమెకు ఒక నెల వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు.
 
ఈ వైరస్ వల్ల ఇప్పటికి సుమారు ఏడుగురు మరణించారని, అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని చైనాలో దీనిని 2011లోనే గుర్తించారని తెలిపారు. ఇది మొదట పశువుల శరీరానికి సోకుతుందని తర్వాత మనుషులకు సోకుతుందని తెలిపారు. ఇవి నల్లి వంటి క్రిములను వ్యాపింప చేస్తాయని వెల్లడించారు. ఇప్పటికే కోవిడ్‌తో అల్లాడుతుంటే మరో కొత్త వైరస్‌ను చైనా ప్రపంచం మీదికి వదలుతోందా అనే భయాందోళనలు నెలకొన్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments