Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోయిన కోవిషీల్డ్ డోసుల స్టాక్... 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (12:34 IST)
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసుల స్టాక్ పెరిగిపోయిన నేపథ్యంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 50 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నాలుగు దేశాలకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. 
 
ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని కోవ్యాక్స్‌ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిలో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్ నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌, బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నట్లు తెలిపాయి.
 
పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపింది. వాటిని వేగంగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరుల పరమైన అవాంతరాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. అందుకే ఎగుమతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments