Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ రాకున్నా.. ఈ లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరండి...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:44 IST)
చాలా మందిలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం లేదు. కానీ, వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటి వారి విధిగా ఆస్పత్రి లేదా హోం క్వారంటైన్‌లో ఉంటూ తనతో పాటు.. ఇతరులను కూడా రక్షించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. 
 
ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు సైతం కీలక ఉత్తర్వులు జారీచేసింది. పాజిటివ్‌ రిపోర్టు రాకున్నా కోవిడ్‌ లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రులు తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. 
 
ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పాటిల్‌, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మినిమిం ఆక్సిజన్‌ లెవెల్‌ కన్నా తక్కువ ఉన్న రోగులకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోని, ఆ ఆదేశాలు అందరికీ చేరేలా చూడాలని స్పష్టం చేసింది.
 
కాగా ఏప్రిల్‌ 23 నుంచే ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది అనూజ్‌ అగర్వాల్‌ కోర్టుకు తెలిపారు. ఇతరత్రా ఆదేశాలు జారీ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కోవిడ్‌-19 పరీక్షలు దేశరాజధానిలో నిర్వహించడం లేదని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments