కోవిడ్‌, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (12:02 IST)
కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో మూడు నాలుగు వారాలు పోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారనుంది. ఇప్పటికే దేశంలో రోజుకు వచ్చే కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మున్ముందు తీవ్రత పీక్ స్టేజ్ కు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటికి ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ముందు ముందు కేసులెక్కువైతే ఆస్పత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. 
 
ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజురోజుకు పాజిటివిటీ రేట్ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పట్టణాల నుంచి జనమంతా పల్లెబాట పట్టారు. ఈ పరిస్థితి మరింత ప్రమాదమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

పట్నం నుంచి వైరస్ పల్లెలకు వ్యాపించడం ఖాయమని అంటున్నారు నిపుణులు.పండగని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదంటున్నారు.
 
దేశంలో శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పదిరోజులకు ముందు పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు.. మరో వారం రోజుల్లో కేసులు రెట్టింపవడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments