Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందును తీసుకునేందుకు కోవిడ్ రోగులు వెళ్లకండి

Webdunia
సోమవారం, 31 మే 2021 (19:50 IST)
ఆనందయ్య మందుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో సీసీఆర్‌ఏఎస్‌ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు, ఇతర అధికారులు.
 
అధికారులు ఏమన్నారంటే :
– ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గిందనడానికి ఆధారాలు లేవు: 
– ఆనందయ్య  పి, ఎల్, ఎఫ్, కె, అనే నాలుగు మందులతో పాటు, కంట్లో డ్రాప్స్‌ వేస్తున్నారు: 
– కాని, మా కమిటీ ముందు ముడిపదార్థాలు లేనందున కె అనే మందు తయారీని చూపించలేదు : 
– పీ, ఎల్, ఎఫ్‌లతో పాటు  కంటిలో ఇచ్చే డ్రాప్స్‌ మాత్రమే చూపించారు: కల్నల్‌ వి.రాములు.
– కంటి డ్రాప్స్‌ కు సంబంధించి కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది:
– ఆనందయ్య వాడే పదార్థాలు హానికరం కావని నివేదికల్లో చెప్పారు:
– కంటి డ్రాప్స్‌పై  పూర్తి నిర్ధారణలు రావాల్సి ఉంది:
– ఆనందయ్య మందు కోవిడ్‌పై ఎంతవరకూ పనిచేస్తుందని సీసీఆర్‌ఎఎస్‌ ట్రయల్స్‌ చేసింది:
– ఆనందయ్య మందువల్ల కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్దారణలు లేవని నివేదికలు స్పష్టంచేశాయి:
– కాకపోతే మందు తయారీలో వాడే పదార్థాల వల్ల ఎలాంటి హాని లేవని చెప్పాయి:
– ఈ మందు వాడడం వల్ల కోవిడ్‌ తగ్గిందని చెప్పడానికి లేదు:
– అలాగే ఆయుర్వేదం అని గుర్తించడానికి కూడా వీల్లేదు:

ఆనందయ్య ఆయుర్వేదం మందుగా గుర్తించాలని కోరితే, దరఖాస్తు చేస్తే దానిపై చట్ట పరిధిలో పరిశీలనలు చేస్తాం:
 
నివేదికల్లో వివరాలు వెల్లడించాక సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలు: 
– కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.
– కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది. నివేదికలు రావడానికి మరో 2-3 వారాల సమయం.
– కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి  నిరాకరణ.
– ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌.
– సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
– కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నేపథ్యంతో ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
– డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు.
– ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు రాకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశం.
– వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే..  కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం.
– మందు పంపిణీ సందర్భంలో కచ్చితంగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments