Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి పొంచివున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు!

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:18 IST)
దేశ‌రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుప‌డుతున్న‌ట్లు కనిపిస్తున్నప్పటికీ, థ‌ర్డ్ వేవ్‌పై ఐఐటి ఢిల్లీ విడుదల చేసిన నివేదిక భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా ఉంది. ఆ రిపోర్టు ప్ర‌కారం కరోనా థ‌ర్డ్ వేవ్‌లో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేల‌కుపైగా కేసులు న‌మోద‌వుతాయ‌ని అంచ‌నా. 
 
అలాగే ప్రతిరోజూ సుమారు తొమ్మిది వేల‌ మంది ఆసుపత్రిలో చేరే అవ‌కాశాలున్నాయి. 
ఈ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాల‌ని దానిలో సూచించారు. ఈ నివేదిక ప్రకారం అటువంటి పరిస్థితి తలెత్తితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంద‌ని అంచ‌నా. 
 
ఈ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే స‌న్నాహాలు ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధానిలో ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ... కేజ్రీవాల్ స‌ర్కారు కలిసి పనిచేస్తున్నాయి. 
 
ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ తయారు చేసిన బ్లూప్రింట్‌ను అమలు చేయడానికి సూచించిన చర్యలు ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గ‌తంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం కోర్టు... ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments