Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం... ఇలా చేయండి..

COVID Vaccine
Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:48 IST)
కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా మే ఒకటో తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. దేశంలోని 18 యేళ్లు దాటిన 45 యేళ్ల లోపు వారికి ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కోవిన్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సివుంది. ఈ పేర్ల నమోదు ప్రక్రియ 28వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభంకానుంది. 
 
'18 ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్‌ 28 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కొవిన్‌ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లోనూ తమ పేరు నమోదు చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్‌ ఖరారవుతుంది' అని మై గవర్నమెంట్‌ ఇండియా ట్విటర్‌ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
 
మరోవైపు, 18 ఏళ్లు పైబడినవారందరూ టీకా కోసం తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని, ఎలాంటి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు ఉండబోవని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అలాగే కేంద్రం.. రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను 45ఏళ్ల లోపు వారికి వినియోగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవి కేవలం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే అందించాలని పేర్కొంది. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్లు మాత్రమే 18-45ఏళ్ల వారికి పంపిణీ చేయాలని తెలిపింది.
 
మరోవైపు, కోవిన్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను ఇలా నమోదు చేసుకోవాల్సివుంది. 
 
* మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.
* దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
* ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
* పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే.. దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. 
* ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments