Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 14మంది మృతి

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (12:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారీగా తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 137కి చేరింది. ఇక కొత్తగా 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 132 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌ జిల్లాలో 3, యాదాద్రి జిల్లాలో 2, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌ జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.  
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయి కేంద్రాల్లోనే చికిత్స అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
జీవనోపాధి కోల్పోకూడదనే లాక్‌డౌన్‌ని ఎత్తేశామని, అవసరం లేకుండా బయటకి వచ్చి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంత్రి విఙ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి, నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments