Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కోరల నుంచి 92.97 శాతం మంది బయటపడి ఇళ్లకు చేరుకున్నారు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (19:44 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదు కావడం, క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపులో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశాలు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది.
 
అలాగే, శుక్రవారం క్రియాశీల కేసుల సంఖ్య 4,80,719 గా ఉండగా.. ఆ రేటు 5.55 శాతానికి తగ్గింది.
ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 81,63,572 (92.97శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 47,992 గా ఉంది.
 
ఈ మహమ్మారి కారణంగా శుక్రవారం 520 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 1,29,188 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ప్రభుత్వం 9,29,491 నమూనా పరీక్షలు నిర్వహించింది. దాంతో ఇప్పటివరకు 12,40,31,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments