ప్రతి మిలియన్ మందికి 47,459 మందికి పరీక్షలు చేశాము: ప్రధానితో సీఎం జగన్

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:12 IST)
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ 9 రాష్ట్రాల సీఎంలతో  వీడియో కాన్పెరెన్స్  నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా అస్సోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
 
ఈ వీడియో కాన్పరెన్స్‌లో కరోనా నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రతీ పదిలక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేశామని. దేశంలో కేసుల సంఖ్య 22 లక్షల 68 వెలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 53,601 కేసులు నమోదు కాగా 871 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,746 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 22,68,675 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 6,39,929 యాక్టివ్ కేసులుండగా 15,83,489 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుండగా 45,257 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 69.80 శాతంగా ఉంది. దేశం మొత్తం నమోదైన కేసులలో 1.90 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 28.21 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments