Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. టెన్త్, ప్లస్‌టూ పాసైతే చాలు

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:59 IST)
ఇండియన్ ఆర్మీ ప్రతీ ఏటా టెన్త్, ప్లస్‌టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నియామకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 44 నోటిఫికేషన్ విడుదల చేసింది. 10+2 పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్మీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. 
 
మొత్తం ఖాళీలు- 90
వయోపరిమితి- 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు.
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9 
పరీక్ష తేదీ- త్వరలో వెల్లడించనున్న ఇండియన్ ఆర్మీ
విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. కనీసం 70% మార్కులు ఉండాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments