శుభవార్త చెప్పిన సీరమ్ ఇనిస్టిట్యూట్ : అక్టోబరు నాటికి కోవిషీల్డ్ వ్యాక్సిన్

Webdunia
గురువారం, 23 జులై 2020 (09:41 IST)
ప్రపంచానికి అమెరికాకు చెందిన సీరన్ ఇనిస్టిట్యూట్ ఓ శుభవార్త వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. దీనిపేరు కోవిషీల్డ్. ఇది వచ్చే అక్టోబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తాజాగా ప్రకటించింది. 
 
అదేసమయంలో దేశంలో వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అపుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు పూనావాలా వెల్లడించారు. 
 
కాగా, దేశీయంగా ఉత్పత్తి చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమైంది. కాగా, అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ టీకా వస్తుందన్న పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం.
 
మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ టీకా తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, ఆస్ట్రియాలో రెండు, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌లో కనీసం వందకోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments