Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. తమిళనాడులో సీనియర్ మంత్రికి పాజిటివ్

Covid-19
Webdunia
శనివారం, 11 జులై 2020 (13:05 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా పెద్దా, పేద, ధనిక తేడా లేకుండా కరోనా సోకుతోంది. తాజాగా తమిళనాడులో ప్రజా ప్రతినిధులను సైతం కరోనా వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆ వైరస్‌ బారిన పడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మరో సీనియర్‌ మంత్రికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడ్డాయి. పక్షం రోజులకు ముందు ఆ మంత్రి సతీమణికి కరోనా వైరస్‌ సోకింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్న తరుణంలో మంత్రికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
గత మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని సదరు మంత్రి తెలపటంతో ముఖ్యమంత్రి షాక్‌ అయ్యారు. తాజాగా కరోనా బారినపడిన మంత్రి మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి నిబంధనలను పాటించినప్పటికీ వైరస్‌ బారిన పడటం గమనార్హం. 
 
ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆ మంత్రికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలు కుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ విధులకు హాజరుకావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్టాలిన్‌ పేర్కొన్నారు.
 
సచివాలయం రెండు రోజులపాటు మూతపడనుంది. కరోనా నిరోధక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు నెలలో రెండు, నాలుగో శనివారాల్లో మూసివేయాలని ఇదివరకే ప్రకటించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంతాలను శానిటైజ్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments