Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో 7 రోజుల పాటు లాక్ డౌన్.. ఎమెర్జెన్సీ సర్వీసులకు మాత్రమే?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (14:28 IST)
బంగ్లాదేశ్‌లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతం అవుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. 
 
ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో రోడ్డు రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యాక్టరీలను తెరిచి ఉంచనున్నారు. కార్మికులు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు ఏడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు పది వేల మంది వైరస్ వల్ల మరణించారు.
 
ప్రభుత్వ పాలన శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్.. మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం సమయంలో అన్ని కార్యాలయాలు, కోర్టులు మూతపడతాయని చెప్పారు. పరిశ్రమలు, మిల్లులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు.
 
అష్ట దిగ్బంధనం సమయంలో పరిశ్రమలను, మిల్లులను ఎందుకు పని చేయనిస్తున్నారని విలేకర్లు అడిగినపుడు ఫర్హాద్ మాట్లాడుతూ, వీటిని మూసేస్తే వర్కర్స్ తాము పని చేసే ప్రదేశాల నుంచి తమ ఇళ్ళకు వెళ్ళిపోవలసి వస్తుందన్నారు. కాగా.. బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో కొత్తగా 6,830 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments