Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కోరల్లో మహారాష్ట్ర : ముంబైలో 200 మంది వైద్యులకు కరోనా

Covid-19
Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:04 IST)
మహారాష్ట్ర కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. కరోనా థర్డ్ వేవ్ మొదలుకావడంతో ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా విలయతాండవం దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొనసాగుతోంది. ఈ మహానగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
 
గత మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 230 మంది వైద్యులకు ఈ వైరస్ బారినపడ్డారు. వీరంతా రెసిడెంట్ వైద్యులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి ప్రెసిడెంట్ గణేశ్ సోలంకి వెల్లడించారు. అలాగే, థానేలో కూడా ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. అదేవిధంగా బ్రిహిన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆరుగు ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన ఉద్యోగుల సంఖ్య 60కి చేరింది. 
 
కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 26538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబై మహానగరంలోనే 16166 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరవ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,76,032కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,505 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments