Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్‌మెంట్‌ ఎంత? భారమెంత? ఉద్యోగుల పీఆర్‌సీపై సీఎం సమీక్ష

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (12:50 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉగ్యోగుల పి.ఆర్.సి. వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం మెడ‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా చుట్టుకుంది. త‌మ‌ని సీఎంను క‌ల‌వ‌నీయకుండా అడ్డుకుంటున్నార‌ని ఎన్జీవో నేత‌లు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో నేడు సీఎం జ‌గ‌న్ వారిని క‌లువ‌నున్నారు. 
 
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్‌ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేశారు. 14.29 శాతం పైన ఎంతశాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. 
 
 
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరిపే స‌మ‌యంలో ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నారు. చర్చల‌కు అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి  కార్యాలయ వర్గాలు సమాచారమిచ్చాయి. దీనితో సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల భేటీకి నేడు ఖరార‌ని చెపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇందులో 16 సంఘాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు. వీరితో చ‌ర్చించిన త‌ర్వాత పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments