Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్ముందు 'కరోనా' విశ్వరూపం తప్పదంటున్న డబ్ల్యూహెచ్ఓ

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (10:15 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఓ పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మున్ముందు మరింతగా ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అడ్హనామ్ హెచ్చరించారు. ఈ కరోనా వైరస్ మున్ముందు మరింత విశ్వరూపం దాల్చుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి, ఇప్పటికే 25 లక్షల మందిని భాధిస్తూ, 1.66 లక్షలకుపైగా ప్రాణాలను బలిగొన్నదనీ, వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయని తెలిపారు. 
 
ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా కొంతమేరకు వైరస్ కట్టడి అయిందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెడ్రాస్ అడ్హనామ్ ఓ పిడుగులాంటి వార్త చెప్పారు. 
 
ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమేనని, ముందుముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందన్నారు. ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్‌ను శాశ్వతంగా అమలుచేసే వీలు లేదని అన్నారు. 
 
సమీప భవిష్యత్తులో ఆరోగ్య విధానం తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఇప్పటికే అంచనా వేసిందని గుర్తుచేశారు. ఇదేవిషయాన్ని గుర్తు చేసిన టీడ్రాస్... కరోనాకు, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకు ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్ ఫ్లూ తరహాలోనే, కరోనా సైతం నిదానంగా విజృంభించి ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు. 
 
"ఈ వైరస్ అత్యంత ప్రమాదకారి. తన ప్రభావాన్ని చూపిస్తోంది. 1918లో దాదాపు కోటి మందిని మృత్యువాత పడేసిన ఫ్లూ వంటిదే ఇది కూడా. అయితే ఇప్పుడు మన ముందు నాడు అందుబాటులో లేని సాంకేతికత ఇపుడు ఉంది. మహమ్మారి ఉత్పాతాన్ని నివారించే వీలుంది. ఆ స్థాయిలో కష్టం ప్రపంచానికి రాకుండా చూడవచ్చు. మహమ్మారి విశ్వరూపం ముందు ముందు కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ దురదృష్టాన్ని నివారించేందుకు అన్ని దేశాలూ కలవాలి. కలిసికట్టుగా ముందుకుసాగాలి. ఈ వైరస్ చూపే ప్రభావంపై ఇప్పటికీ ఎంతో మందికి అవగాహన లేదు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments