Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కరోనా'కు మరణం లేదు : 'వైరస్‌'తో కలిసి జీవించడం నేర్చుకోండి.. డబ్ల్యూహెచ్ఓ

Webdunia
గురువారం, 14 మే 2020 (12:11 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బాంబు పేల్చింది. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని తేల్చి చెప్పింది. పైగా, ఈ వైరస్‌తో కలిసి జీవించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. అంటే, కరోనా వైరస్‌ శాశ్వతంగా కాదని, అందువల్ల దాంతో కలిసి జీవనం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని చెప్పకనే చెప్పినట్టయింది. 
 
చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్ తొలి కేసు 2019, డిసెంబరులో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఈ వైరస్ చాపకింద నీరులా ప్రపంచం మొత్తం విస్తరించింది. ఫలితంగా దాదాపు 250 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4.35 మిలియన్ కేసులు ఉండగా, 297 వేల మంది చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ ఓ ఆట ఆడుకుంటోంది. 
 
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. నోవెల్ క‌రోనా వైర‌స్ ఎక్క‌డికీ వెళ్ల‌దనీ, దాంతో క‌లిసి జీవించ‌డం మ‌నుషులు నేర్చుకోవాల‌ని సూచన చేసింది. వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వ‌ల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. 
 
ప్ర‌పంచ జ‌నాభాలోకి కొత్త‌గా వైర‌స్ ప్ర‌వేశించింద‌ని, అయితే ఎప్పుడు ఆ వైర‌స్‌ను జ‌యిస్తామ‌న్న విష‌యాన్ని ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. ఈ వైర‌స్ మ‌న జీవితాల్లో భాగ‌స్వామ్యం అవుతుంద‌ని, ఇక వైర‌స్ ఇప్ప‌ట్లో వెళ్లే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌న్నారు. 
 
హెచ్ఐవీ ఇంకా వెళ్లిపోలేద‌ని, కానీ ఆ వైర‌స్‌తో జీవించ‌డం నేర్చుకున్నామ‌న్నారు. క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల సుమారు స‌గం ప్ర‌పంచ జ‌నాభా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఈ వైరస్ వ్యాప్తిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments