భారత్‌లో కరోనా ప్రభావం .. కోటి మందిలో ఏడుగురికి సోకిన వైరస్

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (09:02 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. ఈ వైరస్ ఇప్పటికే 199 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ మహమ్మారిబారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తితో పాటు ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆదివారం ఉదయానికి ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. 
 
మరోవైపు, కేసులు/జనాభా నిష్పత్తి ఆధారంగా విశ్లేషిస్తే.. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 0.7 మందికి మాత్రమే వైరస్‌ సోకింది. అంటే.. కోటి మందిలో ఏడుగురు బాధితులు ఉన్నట్టు లెక్క. సమూహవ్యాప్తి దశకు చేరకముందే వైరస్‌ను కట్టడి చేస్తేనే సురక్షితంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం లాక్‌డౌన్‌తోపాటు అనేక ఏర్పాట్లు చేస్తోంది. 
 
మరోవైపు, కరోనా పోరాటంలో రైల్వే శాఖ కూడా తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైలు బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చుతోంది. ఓ జనరల్‌ బోగీని ఐసొలేషన్‌ వార్డుగా మార్చిన చిత్రాలను శనివారం మీడియాకు విడుదలచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ తొలి రోజు కలెక్షన్ అంతేనా?

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments