కరోనావైరస్: వారం వ్యవధిలో రెండో భారీ తగ్గుదల, 24 గంటల్లో 16,504 కొత్త కేసులు

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:41 IST)
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. మరోవైపు కోలుకొన్న కేసుల సంఖ్య కోటికి చేరువవుతోంది. మరోవైపు కొవిడ్ టీకాలకు ఆమోదం లభించడంతో దేశంలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
 
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 16,504 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో వారం రోజుల వ్యవధిలో రెండోసారి అత్యల్ప కేసులు వచ్చాయి. డిసెంబర్ 28 తరవాత ఈ తగ్గుదల నమోదైంది. కాగా, నిన్నటితో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,469కి చేరింది.
 
నిన్న 7,35,978 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే, కేసుల సంఖ్య తగ్గడానికి కరోనా పరీక్షల్లో తగ్గుదల కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.
 
ఇక క్రియాశీల కేసులు 2.5లక్షలకు దిగువనే కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు దేశంలో 2,43,953 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.39శాతానికి చేరింది.
 
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 99,46,867 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతంగా ఉంది. మరోవైపు గత 10రోజులుగా మరణాలు 300 దిగువనే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 214 మంది ఈ మహమ్మారికి బలికాగా.. మొత్తం మరణాల సంఖ్య 1,49,649గా ఉంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments