Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు.. వణికిపోతున్న ప్రజలు

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (12:53 IST)
దేశంలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్యను చూస్తే ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది. 
 
ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 311 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,195కి పెరిగింది. 1,49,348  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు. 
 
ముఖ్యంగా, గడచిన 8 రోజుల వ్యవధిలో ఆరు రోజుల పాటు కేసుల సంఖ్య విషయంలో రికార్డులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 3.21 లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం.
 
ఇక శనివారం నాడు 310 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 9,195కు చేరింది. ప్రపంచంలో వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా ఇప్పుడు 9వ స్థానానికి చేరుకుంది. మొత్తం కేసుల విషయంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత 10 రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే ఆరంభంతో పోలిస్తే, నెలాఖరుకు మరణాల సంఖ్య రెట్టింపయింది.
 
కాగా, దేశంలో తొలి కేసు మార్చి 12న నమోదుకాగా, ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు గత పది రోజుల్లోనే రావడం, మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా కొనసాగుతోందో చెప్పకనే చెబుతోంది. 
 
శనివారం నాటి కేసుల్లో మహారాష్ట్రలో 3,427 కేసులు రాగా, ఢిల్లీలో 2,134 కేసులు, తమిళనాడులో 1948 వచ్చాయి. కొత్త కేసుల విషయంలో తెలంగాణ (253), ఆంధ్రప్రదేశ్ (222), ఒడిశా (225), లడక్ (198), సిక్కిం (33) రాష్ట్రాలు రికార్డును సృష్టించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments