తెలంగాణలో కరోనా వ్యాప్తి, కొత్తగా 1,607 పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (13:41 IST)
తెలంగాణలో కరోనా వ్యాప్తి నానాటికి విస్తరిస్తూనే ఉంది. ఇటీవల తగ్గుముఖ పట్టిన కరోనా కేసులు కాస్త రెండు రోజుల నుంచి మళ్లీ పెరిగాయి. దీంతో రాష్ట్రంలో 1600కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో పాటు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
 
గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,607 కేసులు నమోదు కాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరగా మరణాల సంఖ్య 1,372కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 937 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి 2,27,583 మంది బాధితులు కోలుకున్నారు.
 
ప్రస్తుతం తెలంగాణలో 9,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 91.43గా ఉంది. మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా శుక్రవారం తెలంగాణలో 44,644 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి నవంబరు 6 వరకు మొత్తం  45,75,797 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసులలో నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 296 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments