కరోనా విముక్త రాష్ట్రంగా గోవా ... పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్‌లే...

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:53 IST)
దేశంలో కరోనా విముక్త రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులన్నీ ఇపుడు నెగెటివ్ కేసులుగా తేలాయి. దీంతో ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన రోగులంతా కోలుకున్న తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. 
 
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, రోగులకు చికిత్సలు అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు, వారితో కలిసి నడిచిన హెల్త్ వర్కర్లకు చాలా రుణపడివుంటాం. ఈ ఘనత వైద్యుల శ్రమ, కృషితోనే సాధమైంది' అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటిస్తూ, ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. సామాజిక దూరాన్ని ప్రజలు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్‌‌లైన్స్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. గోవాను కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ం చీఫ్ సెక్రటరీ పరిమల్ రాయ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి నీలా మోహనన్ తదితరులు చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments