Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒకే రోజు 96424 పాజిటివ్ కేసులు ..

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:08 IST)
దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ‌త 10 రోజులుగా ప్ర‌తిరోజూ 90 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. తాజాగా మ‌రో 96424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలు దాటిపోయింది. 
 
ఇందులో 10,17,754 కేసులు యాక్టివ్‌గా ఉండగా, క‌రోనా బారిన‌ప‌డినవారిలో‌ మ‌రో 41,12,552 మంది కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉద‌యం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కు క‌రోనాతో కొత్తగా 1174 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 84,372 మంది బాధితులు చ‌నిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ ప్ర‌క‌టించింది. 
 
మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయ‌ని తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 వేలలోపే యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనే 49 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. అయితే మ‌ర‌ణాల రేటు ఒక శాతం త‌గ్గి ప్ర‌స్తుతం 1.64 శాతంగా ఉంద‌ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments