Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా... ఇటలీని దాటిపోతుందా?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (11:10 IST)
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. జనతా కర్ఫ్యూ తర్వాత ఈ కేసుల సంఖ్య రెండింతలు అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం కరోనా వైరస్ కేసుల సంఖ్య 492కు చేరింది. వీరిలో కేవలం 36 మంది మాత్రమే ఈ వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. 
 
మరోవైపు, ఈశాన్య భారతంలో కూడా కరోనా వైరస్ వెలుగు చూసింది. ఇటీవల బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన మణిపూర్‌కు చెందిన యువతికి వైద్య పరీక్షలు చేయగా, కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యవతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా జన రోడ్లపైకి, వస్తే మాత్రం భారత్ కూడా మరో ఇటలీ అవుతుందనే ఆందోళనను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, మహారాష్ట్ర, కేరళలో కొత్త కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. అత్యధికంగా మహారాష్ట్రలో 100 కేసులు నమోదు కాదా. ఆ తర్వాత కేరళలో 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. చాలా చోట్ల ప్రజలు తమ నివాసాలకే పరిమితం అవుతున్నారు. 
 
నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పోలీసులు మూసేశారు. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రా సీఎంలు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments