Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్లెస్ ప్రిన్స్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళన లేదంటున్న వైద్యులు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (17:31 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రిటీష్ రాజకుటుంబాన్ని తాకింది. 71 యేళ్ళ చార్లెస్ ప్రిన్స్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
అయితే, రోగ లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ లేవని, చిన్నచిన్న సమస్యలు మినహా ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్టు వెల్లడించింది. 
 
అలాగే, ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లాకు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు రాగా, వాటిలో నెగెటివ్ అని తేలింది. దీంతో రాజకుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
గతవారం రాజప్రసాదంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రిన్స్ పాలుపంచుకున్నారనీ, అనేక బృందాలతో కలిసి చర్చలు జరిపారని, వారిలో ఎవరో ఒకరి నుంచి ఈ వైరస్ వ్యాపించివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఎవరినుంచి సోకిందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. 
 
ప్రస్తుతం చార్లెస్ ప్రిన్స్‌తో పాటు.. ఆయన సతీమణి కెమిల్లాలు స్కాట్కాండ్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ క్వారంటైన్ హోంలో ఉంటున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 422 మంది మృత్యువాత పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments