Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaccine@58.82 కోట్లు.. ఈ రోజు కొత్త కరోనా కేసులెన్ని?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:13 IST)
దేశంలో కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58.82 కోట్ల మందికిగా పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర కుంటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందిన క సమాచారం మేరకు 56,10,116 మోతాదులు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఈ నెల 23 నాటికి టీకా డ్రైవ్‌ 220వ రోజుకు చేరింది. సోమవారం 39,62,091 మంది లబ్ధిదారులకు మొదటి డోస్‌ ఇవ్వగా.. 16,48,025 మంది రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి 58,82,21,623 డోసులు పంపిణీ చేయగా.. ఇందులో 45,55,21,465 మందికి తొలి.. మరో 13,27,00,158 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. 
 
సోమవారం 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments