Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు.. 181 మంది మృతి

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (10:29 IST)
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్‌ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని, మరో 181 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,57,985కు పెరిగింది. 
 
ప్రస్తుతం 2,08,826 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,96,885 మంది కోలుకున్నారని.. 1,52,274 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. ఇదిలా ఉంటే.. శనివారం 7,77,377 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చెప్పింది. ఇప్పటి వరకు 18.65కోట్లకుపైగా నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 181 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,08,826కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments