Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా.. ఢిల్లీలో విలయతాండవం... ఐదున్నర లక్షలకు..?

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:04 IST)
దేశాన్ని కరోనా పట్టిపీడిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 19459 మందికి కరోనా సోకింది. దీంతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 548318కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో ఏకంగా 380 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఇండియాలో 12010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 321722గా ఉంది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 210120గా నమోదైంది. 
 
అందువల్ల భారత్‌లో రికవరీ రేటు 58.7గా ఉంది. భారత్‌లో ప్రస్తుతం మరణాల రేటు 3 శాతంగా ఉంది. అంటే కరోనా క్లోజింగ్ కేసుల్లో ప్రతి 100 మందిలో ముగ్గురు చనిపోతున్నారు. ప్రపంచ ప్యాప్తంగా ఈ రేటింగ్ 8 శాతంగా ఉంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. కొత్త కేసుల నమోదులో మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో మూడోస్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో 8వ స్థానంలో ఉంది.
 
ఇక మహారాష్ట్ర, ఢిల్లీలలో వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటివరకు 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 83,077కి చేరగా 2623మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments