దేశంలో మరో 39 వేల పాజిటివ్ కేసులు - తెలంగాణాలో?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (10:16 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 39 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 32,981 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,77,203కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,109 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,573కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,39,901 మంది కోలుకున్నారు. 3,96,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,77,87,656 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,081 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 517 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 862 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,73,858కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,64,606 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,474కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 7,778 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,803 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 57 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

Rashmika: రియల్ పెండ్లి కంటే ముందే రణబాలి లోని రీల్ పెండ్లి సాంగ్ రష్మికకు అంకితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments