Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో ట్వంటీ20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Advertiesment
రెండో ట్వంటీ20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
, ఆదివారం, 6 డిశెంబరు 2020 (13:47 IST)
ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో ట్వంటీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు.
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్‌, సామ్స్‌, ఆండ్రూ టై టీమ్‌లోకి వ‌చ్చారు. 
 
ఆస్ట్రేలియా తరపున ఓపెనర్లుగా వాడే, షార్ట్ బరిలోకి దిగారు. చౌహల్ బౌలింగ్‌ను ప్రారంభచగా, తొలి ఓవర్‌లో తొలి బంతిని వైడ్ వేయగా, ఆ తర్వాత వరుసగా వైడ్ మూడు ఫోర్లు బాదాడు. ఫలితంగా తొలి ఓవర్‌లోనే ఆసీస్ ఏకంగా 13 పరుగులు రాబట్టింది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్లలోని 11 మంది ఆటగాళ్ళ వివరాలు... 
 
భారత్ : ధావన్, రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాగూర్, యుజువేంద్ర  చాహల్, టి.నటరాజన్. 
 
ఆస్ట్రలియా : వాడే, షార్ట్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్యూస్, స్టాయిన్స్, సామ్స్, అబ్బాట్, టై, స్వేప్సన్, జంపా. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో ట్వటీ20 : సిరీస్‌పై కన్నేసిన కోహ్లీ సేన