దేశంలో స్థిరంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (10:54 IST)
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అయితే, కొవిడ్ బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,45,34,188 మంది ఈ వైరస్ సోకింది. వీరిలో 5,28,337 మంది చనిపోయారు. ప్రస్తుతం 47,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, శనివారం 14,84,216 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరింది. 
 
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,38,128 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 774 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,68,56,201 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,30,060 మంది మరణించారు. మరో 5,94,451 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,62,84,233కు చేరింది.
 
జపాన్​లో కొత్తగా 77,804 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 186 మంది ప్రాణాలు కోల్పోయారు.రష్యాలో కొత్తగా 58,305 కేసులు వెలుగుచూశాయి. మరో 107 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 43,400 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 57 మంది మృతి చెందారు.తైవాన్​లో 39,628 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు.ఫ్రాన్స్​లో 33,162 కొత్త కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

తర్వాతి కథనం
Show comments