Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ విస్ఫోటనం - 3 లక్షల పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ విస్ఫోటనం సంభవించినట్టుగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,94,115 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, కరోనాతో 2,023 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,16,130కి కరోనా కేసులు చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,33,76,039 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 1,82,553 మంది మృతి చెందినట్లు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంట‌ల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల మ‌ధ్య  6,542 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 2,887 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,67,901కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,19,537 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,876గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 46,488 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 898 మందికి క‌రోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments