కర్నూలులో 65 యేళ్ళ వృద్ధురాలికి కరోనా?

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఓ కరోనా వైరస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలోని చిన్నబజారుకు చెందిన 24 యేళ్ళ యువకుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఇపుడు మరో వృద్ధురాలికి కూడా ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్త ఇపుడు కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలో ఓ అనుమానిత కేసు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆమె నివసిస్తున్న ప్రాంతం వాసులైతే వణికిపోతున్నారు. పట్టణానికి చెందిన 65 ఏళ్ల మహిళ ఇటీవల జోర్డాన్ వెళ్లి వచ్చింది. 
 
తాజాగా, ఆమెలో వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు పట్టణంలోని సర్వజన వైద్యశాలకు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణె పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
 
మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లో కరోనా కేసులు నమోదు కావడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలో రెండు కేసులు వెలుగు చూశాయి. వీటిలో ఓ కేసు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఇపుడు కర్నూలు వృద్ధురాలి విషయంలో పరీక్షా ఫలితాలు వెల్లడికావాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

Dil Raju: పావలా శ్యామలకు వైద్య చికిత్స చేయిస్తున్న నిర్మాత దిల్ రాజు

దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా

తర్వాతి కథనం
Show comments