వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం.. 24 గంటల్లో 84 కేసులు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:45 IST)
చైనా, వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్‌ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్‌ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. 
 
అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు.
 
ప్రపంచంలో తొలి కరోనా కేసు.. 2019 చివర్లో వుహాన్‌లోనే బయటపడింది. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకింది. అప్పుడు వుహాన్‌లో దాదాపు 76 రోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసింది డ్రాగన్‌. కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్‌ అదుపులోకి వచ్చింది. మళ్లీ ఏడాది తర్వాత ఇప్పుడు కేసులు బయటపడ్డాయి.
 
చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో.. పలు నగరాల్లో ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి.. రవాణా సదుపాయాలను కుదించారు. అలాగే భారీ స్థాయిలో టెస్టులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్

Ram Charan: సుల్తాన్, దంగల్' చిత్రాల జాతీయ కోచ్ వద్ద పెద్ది కోసం శిక్షణ తీసుకున్నా : రామ్ చరణ్

Virat Karna,: నాగబంధం లో సెకండ్ సింగిల్ సుర సుర సాంగ్ చిత్రీకరణ

Naga Shaurya: నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నా : నాగశౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

తర్వాతి కథనం
Show comments