పురుగుల బిర్యానీ.. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు..

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:06 IST)
కాసులకు కక్కుర్తిపడి కొంతమంది హోటల్ యజమానులు జనాలకు పురుగుల బిర్యానీ విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులుగా నిల్వ ఉన్న, కుళ్లిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అయితే నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. బిర్యానీ తిందామని హోటల్‌కి వచ్చిన మున్సిపల్ కమిషనర్‌కి పురుగుల బిర్యానీ వడ్డించి అడ్డంగా బుక్కయ్యారు.
 
నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మి గ్రాండ్ హోటల్‌కి మునిసిపల్‌ కమిషనర్ బాలకృష్ణ, సిబ్బందితో కలిసి లంచ్‌ చేద్దామని వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. వెంటనే హోటల్‌ సిబ్బంది వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించారు. అయితే సిబ్బందితో సహా కమిషనర్ ఒక్కసారిగా షాకయ్యారు. కారణం వారికి వడ్డించిన బిర్యానీలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
 
వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ బిర్యానీని పక్కన పెట్టి సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కిచెన్ గదిలో తనిఖీలు చేయగా ఫ్రిజ్ లో కుళ్లిన చికెన్ , కలుషిత ఆహారం బయటపడింది. ప్రిజ్‌లో ఉంచిన చికెన్ పురుగులు పట్టి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ కోపం నషాళానికి అంటింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ హోటల్‌ను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments