Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మంథ్‌గా ఆగస్టు.. 31 రోజుల్లో 20లక్షల కేసులు... సెప్టెంబరులో?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (10:30 IST)
Corona
ఆగస్టు నెలను కరోనా మంథ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దేశంలో 36 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఆగష్టు నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. 31 రోజుల్లో దేశంలో 20 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. చివరి వారంలో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
ఇక దేశంలో ఐదు రాష్ట్రాల్లోనే కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. అంతేకాదు, మరణాల సంఖ్యలో భారత్ మూడో స్థానంలో వుంది. దేశంలో కేసులు పెరిగిపోతున్నప్పటికీ, ప్రభుత్వం అన్ లాక్ వైపు మొగ్గు చూపుతోంది. సెప్టెంబర్ నుంచి మరిన్ని రంగాలు సేవలు అందించబోతున్నాయి. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. 
 
కేసుల విషయంలో సెప్టెంబర్‌లో పీక్ స్టేజ్ లో ఉండొచ్చునని వైద్యులు అంటున్నారు. ఇకపోతే నగరాల్లో ఒక వంతు జనాభాకు వైరస్ సోకినట్టు నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగష్టు నెలలో 62 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు విస్తరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments