Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-09-2020 బుధవారం దినఫలాలు - నృశింహస్వామిని ఆరాధిస్తే..

Advertiesment
02-09-2020 బుధవారం దినఫలాలు - నృశింహస్వామిని ఆరాధిస్తే..
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం మిత్రులు మీ యత్నాలకు అండగా నిలుస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. ఖర్చులు పెరిగిన అవసరాలు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. 
 
వృషభం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మిథునం : దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. భాగస్వాముల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరోపకారానికి పోయి సమస్యలకు గురికాకండి. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా తట్టుకుంటారు. 
 
కర్కాటకం : మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం ఖర్చు చేస్తారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా కలిసివస్తాయి. 
 
సింహం : ఉద్యోగరీత్యా ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. రావలిసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. కటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
తుల : తొందపడి వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీకు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధమవుతుంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. 
 
వృశ్చికం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాకయం. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులలో సంతృప్తికానవస్తుంది. మీ మాటలు, ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. 
 
ధనస్సు : ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. 
 
మకరం : విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమైంది. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి ప్రోద్భలంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. 
 
కుంభం : ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. భార్యాభర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
మీనం : గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలు వెళ్లటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి చుట్టూ పురుషులు ప్రదక్షణ చేస్తే...?