Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులపై జీఎస్టీ పిడుగు... కనికరం లేని కేంద్రం!

Webdunia
ఆదివారం, 16 మే 2021 (13:41 IST)
కరోనాతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలపై.. జీఎస్టీ కూడా పిడుగులా పడుతోంది. చేతికి వేసుకునే గ్లోవ్స్ నుంచి ఊపిరాడకుంటే అందించే ఆక్సిజన్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ భారంతో సతమతమవుతున్నారు. 
 
కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సకయ్యే ఖర్చుతో పాటు చికిత్సలో వాడిన పరికరాలు, మందులపై జీఎస్టీ రూపంలోనూ మరింత భారం పడుతోంది. ఆసుపత్రి బిల్లుపై 15 శాతం 20 శాతం దాకా ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. 
 
ఆక్సిజన్‌పై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా, చాలా వరకు ఔషధాలపై 12 నుంచి 18 శాతం దాకా ఉంది. కరోనా పరీక్షలు మొదలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చే దాకా ఓ కరోనా పేషెంట్ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.
 
ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ అమలవుతున్న కరోనా పరికరాలు వివరాలను పరిశీలిస్తే, మెడికల్ ఆక్సిజన్, మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్లున్న మాస్కులు, చేతికి వేసుకునే రబ్బర్ గ్లోవ్స్, కరోనా టెస్ట్ కిట్లు, రీ-ఏజెంట్లు, వెంటిలేటర్లు, శ్వాస పరికరాలు, రక్షణ కోసం కళ్లకు పెట్టుకునే అద్దాలు, బ్యాండేజీలు, శస్త్రచికిత్సకు వాడే పరికరాలు
 
అలాగే, 18 శాతం జీఎస్టీ అమలవుతున్న వాటిని పరిశీలిస్కే, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, డిసిన్ ఫెక్టెంట్లు, సబ్బులు, టిష్యూ పేపర్లు, న్యాప్కిన్లు, వ్యర్థాలు వేసే కవర్లు, వస్త్రంతో చేసిన గ్లోవ్స్, సెల్యులోజ్ ఫైబర్‌తో చేసిన మాస్క్‌లు, తలకు వాడే నెట్‌లు, స్టెరిలైజేషన్ కోసం వాడే ఇథైల్ ఆల్కహాల్ రోగుల నుంచి ద్రవాలు సేకరించే శానిటరీవేర్, ల్యాబ్ పరికరాలు, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్లు, క్యాలిబరేటింగ్ మీటర్లు తదితరులువున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments