Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పేషెంట్లకు ఇచ్చే డైట్ వివరాలు... ఖర్జూరం, బాదంపప్పు, ఆంజీర్‌

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (12:39 IST)
కరోనా వైరస్ పేషెంట్లకు ఇచ్చే డైట్ గురించి గాంధీ ఆస్పత్రి వివరాలను వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు డైట్‌లో కొన్ని మార్పులు చేశారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. 
 
ఇందులో భాగంగా ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య అల్పాహారంగా ఇడ్లి, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పం లలో ఏదో ఒకదానితో పాటు పాలు అందిస్తారు. ఆపై 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండు, కూర, మినరల్ వాటర్ బాటిల్‌ను ఇస్తారు. దాని తరువాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతో పాటు ఖర్జూరం, బాదంపప్పు, ఆంజీర్‌ ఇస్తారు. 
 
రాత్రి డిన్నర్‌లో అన్నంతో పాటు కూర, సాంబారు, పెరుగు, పప్పు, మరో కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ ఇస్తామని అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రిలోని వైద్యలు, పారిశుద్థ్య సిబ్బంది, వార్డు బాయ్స్, నర్సులకు కూడా ఇదే డైట్ ను ఇస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments