Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌లో టీచర్లకు.. తిరుమలలో వేద పాఠశాలలో కరోనా కలకలం

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (16:42 IST)
కరీంనగర్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడటంతో విద్యార్థులకు, బోధనా సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం 75 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ కరోనా పరీక్షలు చేయించింది.
 
10 మందికి పాటివ్‌ రావడంతో వీరిని తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత వారం వేద పాఠశాలలో 57 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 21 మంది విద్యార్థులుండగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments