తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌కు మరొకరు బలయ్యారు. కొత్తగా 166 మంది బాధితులు కోవిడ్‌ను జయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 983 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 718 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పైకి కదులుతూ ఆందోళన గురిచేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,291 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 118 మంది కరోనాబారిన పడి మృతిచెందగా.. ఇదే సమయంలో 17,455 కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.