4వేలను దాటిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. వందకి పైగా మృతి

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (11:28 IST)
కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కరోనా వైరస్ విస్తరించగా.. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 109 మంది మృతి చెందారు. ఇంకా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4067 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. 
 
ముఖ్యంగా అత్యధికంగా మహారాష్ట్రలో 690 పాజిటివ్ కేసులు నమోదైనాయి. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా సోకడంతో దేశంలో రెండు మూడు రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. 
 
అటు మహారాష్ట్రలో ఈ వైరస్ వల్ల అత్యధికంగా 45 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో 11 రాష్ట్రాలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర , తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభు

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments