2,301కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 56 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:55 IST)
కరోనా కేసుల సంఖ్య దేశంలోనూ పెరిగిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,301కి చేరింది. కరోనా వైరస్‌తో వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు దొరకడం లేదు.  తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. 
 
ఇంకా రాష్ట్రాల వారీగా కూడా ఎన్ని కరోనా కేసులు నమోదైనాయో విడుదల చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా అత్యధికంగా మహారాష్ట్రలో 356 కరోనా కేసులు నమోదైనాయి. అత్యల్పంగా అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా 2,301 మందికి కరోనా సోకగా, 157మంది డిశ్చార్జ్ అయ్యారు. భారతదేశం మొత్తంగా 56 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు.
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా గత మూడు రోజులుగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తెలంగాణను క్రాస్ చేసి ఏకంగా 161కు చేరుకుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments