Corona: 90వేల దిగువకు కేసులు, 10 లక్షలకు పడిపోయిన క్రియాశీల కేసులు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:58 IST)
దిల్లీ: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,20,477 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 84,332 కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి.

తాజాగా దేశంలో వైరస్ ఉద్ధృతి ఏప్రిల్ ప్రారంభం నాటి స్థాయికి తగ్గింది. అయితే గత మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. 3,67,081 మంది బలయ్యారు.
 
ఇక నిన్న ఒక్కరోజే 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు నెల రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. అలాగే 2.79 కోట్ల మందికిపైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసులు 10లక్షలకు పడిపోయాయి. మరోపక్క నిన్న 34.3లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 25కోట్ల మార్కుకు చేరువైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments