132 రోజుల తర్వాత మొదటిసారి 30 వేలకు దిగువన క‌రోనా కేసులు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (10:42 IST)
దేశంలో కరోనా కేసులు క్ర‌మేపీ త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేసుల‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. తాజాగా కొత్త కేసులు 30వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. దాదాపు 132 రోజుల తర్వాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగివచ్చిందని పేర్కొంది. దేశంలో తాజాగా 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. కాగా, సోమ‌వారం మరో 415 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 4,21,382 మంది క‌రోనా మహమ్మారికి బలయ్యారు.

42,363 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, మొత్తంమీద 3.06కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 4లక్షల దిగువకు క్షీణించాయి. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది.  తాజాగా 66,03,112 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో టీకా డోసుల పంపిణీ 44 కోట్ల మార్కును దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments