Publish Date: Wed, 30 Jun 2021 (13:44 IST)
Updated Date: Wed, 30 Jun 2021 (13:46 IST)
ఏపీలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3620 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1885716కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో మరో 41 మంది చనిపోయారు.
వీరితో కలిపి ఏపీలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12671కి చేరింది. చిత్తూరు జిల్లాలో 7, కృష్ణాలో 7, తూర్పు గోదావరిలో 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, శ్రీకాకుళం 3, అనంతపురం 2, విశాఖ 2, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 987 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 102 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,362 మంది కరోనా నుంచి కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి.
తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 3,651 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,22,593 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,05,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,487 మంది చికిత్స పొందుతున్నారు.
సెల్వి
Publish Date: Wed, 30 Jun 2021 (13:44 IST)
Updated Date: Wed, 30 Jun 2021 (13:46 IST)