దేశంలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:30 IST)
దేశంలో కొత్తగా మరో 42909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,27,37,939కి చేరింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 34,763 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో క‌రోనాతో మ‌రో 380 మంది మృతి చెందారు. ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 4,38,210కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,19,23,405 మంది కోలుకున్నారు. 
 
3,76,324 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 63.43 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,836 కేసులు న‌మోదు కాగా, 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఆదివారం 58,335 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య మొత్తం 6.57 లక్షలకు చేరింది. వైర్‌సతో మరొకరు మృత్యువాత పడటంతో మరణాల సంఖ్య మొత్తం 3,870కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,15,650 మంది తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో ఆ సంఖ్య మొత్తం 1.31 కోట్లకు చేరింది. మరో 60 వేల మంది రెండో డోసు తీసుకోవడంతో ఆ డోసు తీసుకున్న వారి సంఖ్య మొత్తం 45 లక్షలకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments